తన మిత్రుడు ఆనంద్ సాయితో కలిసి 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన పవన్ కల్యాణ్

04-04-2021 Sun 21:13
Advertisement 1

హైదరాబాదు శిల్పకళావేదికలో జరుగుతున్న వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ వస్తారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను సంతోషసాగరంలో ముంచెత్తుతూ పవన్ కల్యాణ్ తన మిత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈవెంట్ కు వచ్చారు. పవన్ కు వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు స్వాగతం పలికారు. పవన్ రాకతో కాసేపు శిల్పకళావేదిక మార్మోగిపోయింది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1