వైసీపీ సమీప ప్రత్యర్థి ఎవరని తెలుసుకునేందుకు మాత్రమే తిరుపతి ఉప ఎన్నిక: అంబటి రాంబాబు

04-04-2021 Sun 15:11
Advertisement 1

సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక అయినా ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

వైసీపీ సమీప ప్రత్యర్థి ఎవరని తెలుసుకునేందుకు మాత్రమే తిరుపతి ఎన్నిక అని స్పష్టం చేశారు. తద్వారా ప్రథమస్థానం తమదేనని, తమ తర్వాత రెండో స్థానంలో నిలిచే పార్టీ ఏదన్న విషయం ఈ ఉప ఎన్నిక ద్వారా తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, తిరుపతి ఉప ఎన్నిక బరిలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం నిన్నటితో ముగియగా... ఆఖరుకు 28 మంది బరిలో మిగిలారు. ప్రధానంగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ మధ్యే పోటీ ఉండనుంది.

Advertisement 1

More Flash News
Advertisement 1
..more
Advertisement 1