కల్యాణమస్తుకు కుదిరిన ముహూర్తం... మే 2, అక్టోబర్ 30, నవంబర్ 17!

25-03-2021 Thu 09:14
advertisement

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా, మొదలైన టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమానికి మరోమారు రంగం సిద్ధమైంది. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని సాక్షిగా వివాహమాడే వారికి రెండు గ్రాముల బంగారు తాళిబొట్టుతో పాటు, పసుపు బట్టలు, పెళ్లికి వచ్చిన వారికి విందు ఏర్పాటు చేస్తూ, వివాహాలను వైభవంగా జరిపించేందుకు మూడు ముహూర్తాలను టీటీడీ వేద పండితులు ఖరారు చేశారు.

ఇందుకు గాను మే 2, అక్టోబర్ 30, నవంబర్ 17 తేదీల్లో అభిజిత్ లగ్నాల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఈ తేదీల్లో కల్యాణాలు జరిపిస్తామని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ కల్యాణాలు ఎక్కడ జరుగుతాయో పాలక మండలి నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.

ఇప్పటికే టీటీడీ ట్రెజరీలో 20 వేలకు పైగా తాళిబొట్లు ఉండగా, తొలి దశలో వాటిని వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయించింది. గతంలో 2007 నుంచి 2011 వరకూ ఏటా రెండు విడతలుగా కల్యాణమస్తు కార్యక్రమం జరిగిందన్న సంగతి తెలిసిందే. ఆపై వైఎస్ మరణానంతరం ఈ కార్యక్రమం ఆగిపోగా, జగన్ అధికారంలోకి వచ్చి, వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత దీన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement