శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న 'జాతిర‌త్నాలు' హీరో, హీరోయిన్లు‌!

18-03-2021 Thu 10:59
advertisement

ద‌ర్శ‌కుడు అనుదీప్ తెర‌కెక్కించిన 'జాతిర‌త్నాలు' సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. పూర్తి వినోదాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో ఈ సినీ బృందం ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుంది.

ఈ నేప‌థ్యంలో హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లాకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. శ్రీ‌వారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ సినిమా టీమ్ అనంత‌రం బ‌య‌ట‌ ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ఈ సినిమాను స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్ నిర్మించారు.

రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ఈ సినిమాలో ఇతర కీల‌క పాత్ర‌ల్లో న‌టించి సినిమా స‌క్సెస్‌కు కార‌ణ‌మ‌య్యారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు వారు న‌వ్విస్తూనే ఉన్నారు. రాధన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్ల‌కు దూర‌మైన ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా మ‌ళ్లీ సినిమా హాళ్ల‌కు ర‌ప్పిస్తోంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement