పేద విద్యార్థి చేసిన ట్వీట్‌కు స్పందించి సాయం చేసిన తెలంగాణ‌ గవ‌ర్న‌ర్ త‌మిళిసై! ‌

16-03-2021 Tue 10:48
advertisement

తెలంగాణ‌ గవర్నర్‌ తమిళిసై సౌంద‌ర రాజ‌న్ త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. ట్విట్ట‌ర్‌లో ఓ విద్యార్థి చేసిన ట్వీట్‌కు స్పందించి అత‌డికి సాయం చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బియ్యని ప్రమోద్ అనే కుర్రాడు పేద‌రికంతో బాధ‌ప‌డుతున్నాడు.

అత‌డు మొయినాబాద్‌ సమీపంలోని జోగినపల్లి బీఆర్‌ ఫార్మసీ కాలేజీలో ఫార్మ్ డీ థ‌ర్డ్ ఇయ‌ర్ విద్యార్థి. త‌న‌కు ల్యాప్‌టాప్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్నానని చెబుతూ ఇటీవ‌ల గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు ట్వీట్ చేశాడు.

అత‌డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ‘మై గవర్నమెంట్‌ యాప్‌’లో క్విజ్‌ పోటీలలో కూడా పాల్గొంటుంటాడు. ల్యాప్‌టాప్ లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని తన సమస్యను వివరిస్తూ తెలిపాడు. దీంతో అత‌డి ట్వీట్ కి స్పందించిన గవర్నర్ నిన్న‌ రాజ్‌భవన్‌కి పిలిపించి ల్యాప్‌టాప్‌ అందించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement