తిరుమలలో కరోనా కలకలం.. 50 మంది వేద విద్యార్థులకు సోకిన మహమ్మారి!

10-03-2021 Wed 08:00
advertisement

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో చదువుకుంటున్న వేద విద్యార్థుల్లో దాదాపు 50 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. వీరంతా కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో స్విమ్స్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వీరికి కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మిగతా విద్యార్థులను వీరి నుంచి దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో టీటీడీ అధికారుల నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement