కేసీఆర్ అంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నారు... వడ్డీతో పాటు చెల్లిస్తాం: కేటీఆర్

06-03-2021 Sat 16:30
advertisement

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించగా, కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైందని, సీఎంలనే హడలెత్తించిన పార్టీగా టీఆర్ఎస్ కు ఘనచరిత్ర ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ అంటే కొందరు లెక్కలేకుండా మాట్లాడుతున్నారని, వారికి వడ్డీతో పాటు చెల్లిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ మౌనాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దని విపక్షాలను హెచ్చరించారు.

గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని, సమయం వచ్చినప్పుడే దాని సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలంగాణ మొత్తానికి తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. వాట్సాప్ వర్సిటీలో బీజేపీ నేతలు అబద్ధాలు నేర్చుకుంటున్నారని, తాము నేర్చుకున్న అబద్ధాలను తిరిగి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement