తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!

25-02-2021 Thu 07:04
advertisement

గత వారాంతంలో మొదలైన రద్దీ తిరుమలలో ఇంకా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వరుని దర్శనాల కోటాను పెంచడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నిన్న బుధవారం నాడు 55,297 మంది భక్తులు వెంకన్నను దర్శించుకోగా, 29,120 మంది తలనీలాలను సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

హుండీ ద్వారా రూ. 3.31 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో త్వరలోనే దర్శనాల టికెట్ల కోటాను మరింతగా పెంచనున్నట్టు పాలక మండలి ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంలో కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement