ఆఖరి నిమిషంలో.. ఉప మేయ‌ర్ అభ్య‌ర్థిని మార్చిన బీజేపీ

11-02-2021 Thu 12:18
advertisement

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్  కార్పొరేట‌ర్లుగా ఎన్నికైన వారు ఈ రోజు ప్ర‌త్యేక స‌మావేశంలో ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అనంతరం నిమిషాల వ్య‌వ‌ధిలోనే ప‌లు కీలక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కాసేప‌ట్లో కార్పొరేట‌ర్లు మేయ‌ర్, ఉప మేయ‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ ఎన్నిక‌ల్లో పాల్గొనడం లేద‌ని ఇద్ద‌రు కాంగ్రెస్ అభ్య‌ర్థులు చెప్పారు.

బీజేపీలోనూ మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఉప మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఆ పార్టీ మొద‌ట ర‌విచారిని ప్ర‌క‌టించింది. అయితే, ఈ రోజు జీహెచ్ంఎసీ స‌మావేశానికి ఆయ‌న ఆల‌స్యంగా రావ‌డంతో బేగంబ‌జార్ కార్పొరేట‌ర్ శంక‌ర్ యాద‌వ్ పేరును బీజేపీ ప్ర‌క‌టించింది. కాసేప‌ట్లో జీహెచ్ఎంసీ మేయ‌ర్, ఉప మేయ‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement