త‌మిళ‌నాడులో శ్రీవారి ఆల‌యం కోసం టీటీడీకి భారీ విరాళం!

06-02-2021 Sat 10:08
advertisement

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం వ‌చ్చింది. త‌‌మిళ‌నాడులోని ఉల్లందూర్ పేట‌లో శ్రీవారి ఆల‌య నిర్మాణానికి గాను టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడు కుమార‌గురు  రూ.20 కోట్ల విలువ చేసే నాలుగు ఎక‌రాల స్థ‌లంతో పాటు రూ.3.16 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డికి అంద‌జేశారు.

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు తాము శ్రీవారి ఆల‌యాల‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో దాదాపు 20 కోట్ల రూపాయ‌ల స్థ‌లాన్ని ఇచ్చిన కుమార‌గురుకు అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. ఉల్లందూర్‌పేట‌లో త్వ‌ర‌లోనే ఆల‌య నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తామ‌ని వివ‌రించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement