జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్యంత ఎత్తైన భ‌వ‌నానికి అనుమ‌తులు

06-02-2021 Sat 09:48
advertisement

హైద‌రాబాద్ శివారులో అత్యంత ఎత్తైన భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు. ఇందుకోసం బిల్డ‌ర్లు  గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నుంచి అనుమ‌తులు పొందారు.  నాన‌క్‌రాంగూడ‌లోని వేవ్‌రాక్ బిల్డింగ్ స‌మీపంలో ఐదు ఎక‌రాల స్థ‌లంలో 44 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు. ఈ నిర్మాణం పూర్త‌యితే జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్యంత ఎత్తైన భ‌వ‌నంగా ఇది నిల‌వ‌నుంది. ఇందుకోసం మొత్తం రూ. 900 కోట్లు ఖ‌ర్చుచేయ‌నున్నారు.

కాగా, హైద‌రాబాద్‌లోని మియాపూర్‌, షేక్‌పేట ప్రాంతాల్లోనూ ఇప్ప‌టికే 40 అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు, పుప్పాల్‌గూడ‌, నార్సింగితో పాటు ఇత‌ర ప్రాంతాల్లోనూ కొంద‌రు  55 అంత‌స్తుల భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు హెచ్ఎండీఏకు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల్ల వాటికి అనుమ‌తులు రాలేదు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement