లాక్ డౌన్ తరువాత తొలిసారి... 50 వేలకు తిరుమల భక్తుల సంఖ్య

26-01-2021 Tue 09:41
advertisement

కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించిన వేళ, భక్తుల దర్శనాలను నిలిపివేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో, ఇప్పుడు యాత్రికుల సంఖ్య భారీగా పెరిగింది. గడచిన 10 నెలల వ్యవధిలో తొలిసారిగా ఒక రోజులో స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 50 వేలకు చేరువైంది. నిన్న సోమవారం నాడు స్వామిని 49,346 మంది భక్తులు దర్శించుకున్నారని, 18,436 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో హుండీ ద్వారా వచ్చే ఆదాయం రూ. 3.58 కోట్లకు పెరిగిందని అన్నారు. ఆలయాన్ని తిరిగి తెరిచిన తరువాత, ఇంత భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

advertisement

More Flash News
advertisement
..more
advertisement