ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు రేపు టీమిండియా ఎంపిక

18-01-2021 Mon 19:49
advertisement

ఇటీవల కొత్తగా నియమితులైన బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ రేపు సమావేశం కానుంది. ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు టీమిండియాను ఎంపిక చేయనుంది. ఆసీస్ తో సిరీస్ సందర్భంగా గాయపడిన ఆటగాళ్లపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా నటరాజన్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వంటి కొత్త ఆటగాళ్లు ఆసీస్ గడ్డపై విశేషంగా రాణిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ తో సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేయడం సెలెక్టర్లకు కాస్త కష్టమైన విషయమే.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిశాక టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు తొలి టెస్టు, ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు రెండో టెస్టు చెన్నై వేదికగా జరగనున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు ఈ నెల 27న చెన్నై రానుంది. ప్రస్తుతం లంకతో ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టులో లేని ఆటగాళ్లు కాస్త ముందుగానే జనవరి 23న భారత్ చేరుకోనున్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement