ఈ నెల 27న జరగాల్సిన గాయని సునీత వివాహం వాయిదా!

16-12-2020 Wed 08:24
advertisement

ఈ నెల 27న జరగాల్సిన సింగర్ సునీత, డిజిటల్ మీడియా సంస్థ అధినేత వీరపనేని రామ్ వివాహం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు తెలుస్తోంది. సునీత, మొదటి భర్తతో విడాకులు తీసుకుని, చాలా సంవత్సరాల తరువాత రెండో పెళ్లికి సిద్ధంకాగా, ఇటీవల సునీత, రామ్ ల నిశ్చితార్థం కొద్ది మంది అతిథుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం, వచ్చే సంవత్సరంలోనే వీరి పెళ్లి జరుగుతుందని, మరో మంచి ముహూర్తాన్ని ఇందుకు ఖరారు చేసుకోవాలని రెండు కుటుంబాలు నిర్ణయించినట్టుగా సమాచారం. 

advertisement

More Flash News
advertisement
..more
advertisement