హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

13-12-2020 Sun 10:37
advertisement

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో గచ్చిబౌలిలో టిప్పర్‌ను కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మరోవైపు, పటాన్‌చెరు, కూకట్‌పల్లిలోనూ ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

పటాన్‌చెరులోని ముత్తంగి దగ్గర కంటైనర్‌ను ఓ బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు సంగారెడ్డి జిల్లా రుద్రారానికి చెందిన రాజు, ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. నగరంలోని కూకట్‌పల్లిలో ఓ బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు.
 


advertisement

More Flash News
advertisement
..more
advertisement