కళాశాల దరఖాస్తులో బాలీవుడ్ తారలను తల్లిదండ్రులుగా పేర్కొన్న విద్యార్థి

12-12-2020 Sat 22:11
advertisement

బీహార్ లో ఓ విద్యార్థి కళాశాలలో సమర్పించిన దరఖాస్తులో తల్లిదండ్రులుగా బాలీవుడ్ సినీ నటులను పేర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని ముజఫర్ పూర్ కు చెందిన కుందన్ కుమార్ (20) స్థానిక ధన్ రాజ్ మహతో కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్నాడు. అయితే పరీక్షల కోసం దరఖాస్తు చేసే క్రమంలో తల్లిదండ్రుల పేర్లు రాయాల్సిన చోట సినీ తారల పేర్లు పేర్కొన్నాడు. తల్లి పేరు సన్నీ లియోనీ అని, తండ్రి పేరు ఇమ్రాన్ హష్మీ అని రాశాడు.

అయితే ఈ విషయం బాలీవుడ్ నటి సన్నీ లియోనీ దృష్టికి వెళ్లింది. బాబోయ్, ఈ పిల్లలు మామూలోళ్లు కాదు.. అంటూ స్పందించారు. ఇలాగే కలలు కంటూ ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. సన్నీ స్పందించిందన్న కారణంతో సామాజిక మాధ్యమాల్లో కుందన్ కుమార్ దరఖాస్తు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement