హైదరాబాద్‌లో ఇటీవల గెలిచిన బీజేపీ కార్పొరేటర్ వాహనంపై రాళ్లతో దాడి!

11-12-2020 Fri 12:52
advertisement

ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  బీజేపీ 48 సీట్లు దక్కించుకుని టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి కొత్తగా ఎన్నికైన కొందరు బీజేపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది.

ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ శివారు వనస్థలిపురం పీఎస్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్‌ లచ్చిరెడ్డి వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, ఇటుకలతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లచ్చిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.  

advertisement

More Flash News
advertisement
..more
advertisement