కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

06-12-2020 Sun 13:45
advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా విజయాలు నమోదు చేసింది. 2016లో 4 డివిజన్లకే పరిమితమైన కమలనాథులు ఈసారి 48 డివిజన్లలో జయకేతనం ఎగురవేశారు. గ్రేటర్ ఫలితాలు వెల్లడైన అనంతరం, తమ కార్పొరేటర్లతో కలిసి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు.

చెప్పినట్టుగానే ఆయన ఇవాళ తమ కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి విచ్చేశారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ వర్గాలు బీజేపీ నేతలకు తీర్థప్రసాదాలు అందజేశారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement