టీఆర్ఎస్ నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు: ఒవైసీ

05-12-2020 Sat 17:45
advertisement

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటింది. తనకు బాగా పట్టున్న ఓల్డ్ సిటీలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం, టీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం ఉందని ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ ఆరోపిస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని కేటీఆర్ కొట్టిపారేశారు.

తాజాగా ఇదే అశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, గ్రేటర్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీఆర్ఎస్ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. ఫలితాలను ఎన్నికల సంఘం పూర్తిగా ప్రకటించిన తర్వాత పార్టీలో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఒవైసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తాత్కాలికం మాత్రమేనని చెప్పారు.  

advertisement

More Flash News
advertisement
..more
advertisement