కేసీఆర్ వద్ద చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

05-12-2020 Sat 16:49
advertisement

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీలో చేరతారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.... కాంగ్రెస్ పార్టీ గనుక టీఆర్ఎస్ తో కలిస్తే తాను బీజేపీలో చేరతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల భాష మారాలి అని అన్నారు. కేసీఆర్ కు పదునైన భాషతో బదులు చెప్పే నేతలు కావాలని ఉద్ఘాటించారు. కేసీఆర్ వద్ద చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉందని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంపై మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో వెనుకబడ్డామని అభిప్రాయపడ్డారు. ఎవరిని పీసీసీ చీఫ్ గా నియమించినా అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు అని కొండా సొంత పార్టీ నేతలను విమర్శించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ జేబులో మనుషులు అన్న అపవాదు ఉందని ఆరోపించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement