ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది: టీడీపీపై విజయసాయిరెడ్డి సెటైర్

05-12-2020 Sat 10:40
advertisement

 నిన్న ప్రకటించిన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కని విషయం తెలిసిందే. 106 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి ఫలితాలు ఇలాగే వస్తాయని జోస్యం చెప్పారు.

‘జీహెచ్ఎంసీ ఎన్నికలలో 106 స్థానాల్లో పోటీ చేస్తే దక్కింది సున్నా! కిందటిసారి తండ్రి కొడుకులు, మద్దతుదారులైన సినీ నటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెల్చారు. బాబు పార్టీ ఎగబాకుతుందో దిగజారుతోందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.   

advertisement

More Flash News
advertisement
..more
advertisement