ఐపీఎల్‌లో ఓడిపోయినందుకు విరాట్ కోహ్లీ భావోద్వేగభరిత వ్యాఖ్యలు

07-11-2020 Sat 12:26
advertisement

ఐపీఎల్‌లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఓడిపోయిన నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌లో జట్టు సభ్యులమంతా ఒడిదుడుకులను తట్టుకుని మెరుగైన ప్రదర్శన ఇచ్చామని, జట్టుగా తమకు ఇది గొప్ప అనుభూతి అని అన్నాడు. అయినప్పటికీ ఆర్సీబీకి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని చెప్పుకొచ్చాడు. తన జట్టు‌ సభ్యులు, సిబ్బంది సహకారం మరువలేనిదని, అలాగే, తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ అని పేర్కొన్నాడు. అభిమానుల ఆదరణతో మరింత బలం పుంజుకుని మళ్లీ కలుస్తానంటూ ట్వీట్ చేశాడు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement