ఐపీఎల్ ఎలిమినేటర్: కష్టాల్లో సన్ రైజర్స్

06-11-2020 Fri 22:37
advertisement

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కష్టాల్లో పడింది. రాయల్ చాలెంజర్స్ పై ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ అనూహ్యంగా ఒత్తిడికి గురైంది. ఆ ఒత్తిడి ఫలితమే 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మామూలుగా అయితే 132 పరుగుల టార్గెట్ ఏమంత పెద్దది కాదు. కానీ ఇది ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. దాంతో స్వల్ప లక్ష్యఛేదనలోనూ సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ తమ సహజసిద్ధ ఆటతీరు కనబర్చలేకపోయారు.

ఓపెనర్ గోస్వామి డకౌట్ కాగా, మరో ఓపెనర్ కెప్టెన్ వార్నర్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మనీష్ పాండే సైతం 24 పరుగులు చేసి జంపా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఈ టోర్నీ ఆసాంతం పేలవఫామ్ తో ఉన్న ప్రియమ్ గార్గ్ (7) ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. మరోసారి స్వల్పస్కోరుకు వెనుదిరిగాడు.

ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 14 ఓవర్లలో 4 వికెట్లకు 81 పరుగులు కాగా, క్రీజులో కేన్ విలియమ్సన్, జాసన్ హోల్డర్ వున్నారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, జంపా, చహల్ చెరో వికెట్ తీశారు. సన్ రైజర్స్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 51 పరుగులు చేయాలి.

advertisement

More Flash News
advertisement
..more
advertisement