దావోస్ వెళ్లినా, ఐఐటీ బాంబే విద్యార్థులతో అయినా చంద్రబాబు ఇలాంటి కటింగ్ లే ఇస్తాడు: విజయసాయి

02-11-2020 Mon 14:02
advertisement

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్న చంద్రబాబు ఐఐటీ బాంబే విద్యార్థులతో ఆన్ లైన్ లో ముచ్చటించిన నేపథ్యంలో విజయసాయి స్పందించారు. స్వభావరీత్యా చంద్రబాబు 'పాథలాజికల్ లయర్' అని అభివర్ణించారు. అలవోకగా, కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెబుతుంటాడని ఆరోపించారు.

ఇలాంటి వారు అసత్యం పలకకుండా తమను తాము నియంత్రించుకోలేరని సోషల్ సైకాలజీ చెబుతుంది అని విజయసాయి ట్వీట్ చేశారు. చంద్రబాబు దావోస్ వెళ్లినా, ఐఐటీ బాంబే విద్యార్థులతో అయినా ఇలాగే కటింగ్ లు ఇస్తాడని వ్యాఖ్యానించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement