రాణించిన కోహ్లీ, మోరిస్... పంజాబ్ లక్ష్యం 172 రన్స్

15-10-2020 Thu 21:18
advertisement

షార్జా క్రికెట్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ 39 బంతుల్లో 48 పరుగులు చేయగా, ఆఖర్లో ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 25 పరుగులు సాధించాడు. మహ్మద్ షమీ విసిరిన చివరి ఓవర్లో బెంగళూరు ఆటగాళ్లు ఏకంగా ఒక ఫోర్, 3 సిక్సులు బాది మొత్తం 24 పరుగులు పిండుకున్నారు.

పంజాబ్ బౌలర్లు చివరి ఓవర్ ముందు వరకు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినట్టుగానే భావించినా, క్రిస్ మోరిస్, ఇసురు ఉదన బ్యాట్లు ఝుళిపించడంతో స్కోరుబోర్డు మరింత ముందుకు సాగింది. అంతకుముందు ఓపెనర్లు ఫించ్ 20, పడిక్కల్ 18 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, మురుగన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. అర్షదీప్, క్రిస్ జోర్డాన్ చెరో వికెట్ పడగొట్టారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement