మ్యాచ్ గెలిచి డ్రెస్సింగ్ రూమ్ లో సరదాగా గడిపిన కోహ్లీ సేన.. వీడియో ఇదిగో

13-10-2020 Tue 13:05
advertisement

ఐపీఎల్ మ్యాచుల్లో భాగంగా షార్జాలో నిన్న  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై బెంగళూరు ఘన విజయం సాధించింది. డివిలియర్స్, కోహ్లీ అద్భుత ఆట తీరుతో తమ జట్టును గెలిపించుకున్నారు.

ఈ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు హాయిగా పలకరించుకున్న సమయంలో తీసిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కోహ్లీ, డివిలియర్స్ తో పాటు దాదాపు అందరు ఆటగాళ్లు ఒకరినొకరు కరచాలనం చేసుకుంటూ సరదాగా గడిపారు. అనంతరం మ్యాచ్ పై తమ అభిప్రాయాలను తెలిపారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement