పంత్ కొట్టిన ఫైన్ లెగ్ సిక్స్ కు సచిన్ టెండూల్కర్ ఫిదా

05-10-2020 Mon 21:39
advertisement

దుబాయ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మెన్ విజృంభించి ఆడారు. ఓపెనర్ పృథ్వీ షా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సులు), శిఖర్ ధావన్ (28 బంతుల్లో 32), మార్కస్ స్టొయినిస్ (26 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సులు), రిషబ్ పంత్ (25 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సులు) ధాటిగా ఆడారు. దాంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది.

ఈ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే స్టొయినిస్ ఆటే. మిడిలార్డర్ లో వచ్చిన స్టొయినిస్ బ్యాట్ తో వీరవిహారం చేశాడు. స్టొయినిస్ స్ట్రయిక్ రేట్ 203 అంటే ఎంత ధాటిగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఆరంభంలో ఓపెనర్ పృథ్వీ షా కూడా ఇదే తరహా ఆటతీరు కనబర్చాడు.

ఇక, ఈ ఇన్నింగ్స్ లో సిరాజ్ వేసిన ఓ బంతిని పంత్ ఫైన్ లైగ్ దిశగా కొట్టిన సిక్సర్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను కూడా ముగ్ధుడ్ని చేసింది. తన సంతోషం ఆపుకోలేక సచిన్ ట్విట్టర్ లో ఆ షాట్ గురించి ప్రస్తావించారు. ఇక బెంగళూరు బౌలర్లలో ఇసురు ఉదన, మొయిన్ అలీ చెరో వికెట్ తీయగా, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు సాధించాడు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement