ఐపీఎల్ 2020: పడిక్కల్ పంచ్... డివిలియర్స్ విధ్వంసం!

21-09-2020 Mon 21:41
advertisement

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడి తరహాలో అద్భుతంగా ఆడి 8 ఫోర్లతో 56 పరుగులు సాధించాడు. ఇక స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 51 పరుగులు నమోదు చేశాడు.

ఓపెనర్లు పడిక్కల్, ఫించ్ (29) తొలి వికెట్ కు 90 పరుగుల శుభారంభం అందించినా, వెంటవెంటనే వికెట్లు పడడంతో బెంగళూరు స్కోరు వేగం మందగించింది. కెప్టెన్ కోహ్లీ 14 పరుగులు మాత్రమే చేసి నటరాజన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. డివిలియర్స్ మెరుపుదాడితో బెంగళూరు ఓ మోస్తరు భారీ స్కోరు సాధించగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement