బీసీసీఐ చీఫ్​ సెలెక్టర్​ గా సునీల్​ జోషి నియామకం

04-03-2020 Wed 20:37
advertisement

బీసీసీఐ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ గా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నియమితులయ్యారు. సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేస్ బౌలర్ హర్వీందర్ సింగ్ ను ఎంపిక చేశారు. కాగా, సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్ ఎంపిక విషయమై క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో సీఏసీ సభ్యులు మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్, సులక్షణా నాయక్ లు లో ఈరోజు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూకు సునీల్ జోషి, మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, ఎల్.ఎస్.శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్, హర్వీందర్ సింగ్ హాజరయ్యారు. సీఏసీ సిఫారసుల మేరకు సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ పేర్లను బీసీసీఐ ప్రకటించింది. కాగా, త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం సునీల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement