కోహ్లీ భార్యకు టీకప్పులు అందించడమే సెలెక్టర్ల పని: ఫరూక్ ఇంజినీర్ తీవ్ర వ్యాఖ్యలు

31-10-2019 Thu 15:39
advertisement

టీమిండియా సెలెక్టర్లపై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ మండిపడ్డారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీకప్పులు అందించడమే సెలెక్టర్ల పని అని విమర్శించారు. ఇది మిక్కీ మౌస్ సెలెక్షన్ కమిటీ అని ఎద్దేవా చేశారు. సెలెక్షన్ కమిటీపై కోహ్లీ ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పారు.

అసలు ఈ సెలెక్టర్లను ఎలా ఎంపిక చేస్తున్నారో కూడా తనకు అర్థం కావడం లేదని అన్నారు. 10 నుంచి 12 టెస్టు మ్యాచుల కంటే ఎక్కువ వీరెవరూ ఆడలేదని చెప్పారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ లో ఒక సెలెక్టర్ ను తాను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయానని ఫరూక్ ఇంజినీర్ తెలిపారు. టీమిండియా బ్లేజర్ వేసుకుని అతను ఉండటంతో... నీవు ఎవరని అడిగానని చెప్పారు. దీనికి సమాధానంగా తాను సెలెక్టర్ నని చెప్పాడని తెలిపారు.

సెలెక్షన్ కమిటీలో దిలీప్ వెంగ్ సర్కార్ ఉండాలని తాను భావిస్తున్నానని ఫరూక్ ఇంజినీర్ చెప్పారు. వెంగ్ సర్కార్ స్థాయి ఉన్న వ్యక్తులు కమిటీలో ఉండాలని అన్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement