పోయిన బెంగళూరు... హైదరాబాద్ నూ వెంటేసుకెళ్లింది!

05-05-2019 Sun 07:05
advertisement

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయి, పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ చాన్స్ ను కొల్లగొట్టింది. నిన్న రాత్రి బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు సన్ రైజర్స్ జట్టును ఓడించింది. ఇక హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే నేడు జరిగే మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓడిపోవాల్సిందే. అప్పుడు మాత్రమే మెరుగైన రన్ రేట్ తో ఉన్న హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. కోల్ కతా జట్టు నేడు ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.

కాగా, నిన్న రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తమ సొంతగడ్డపై ఆర్సీబీ చెలరేగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగా, బెంగళూరు జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి విజయం సాధించింది. బెంగళూరు జట్టులో హెట్‌ మైర్‌ (47 బంతుల్లో 75; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గురుకీరత్‌ (48 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్‌)లు నాలుగో వికెట్‌ కు ఏకంగా 144 పరు గులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement