ఆటలో పొరపాటున బూతు మాట ఉపయోగించిన కేఎల్ రాహుల్.. మైక్ ఉందన్న విషయం తెలిసి కంగారు

25-04-2019 Thu 09:20
advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ బూతు పదాన్ని ఉపయోగించి ఆ తర్వాత కంగారు పడ్డాడు. ఫీల్డర్లతో కామెంటేటర్లు మాట్లాడడం ఇటీవల చాలా సహజంగా మారింది. మైక్రోఫోన్‌ ద్వారా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తూనే మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో ప్లేయింగ్ కండిషన్స్‌పై కేఎల్ రాహుల్ మాట్లాడుతున్నాడు. పంజాబ్ బౌలర్ మహ్మద్ షమీ రెండో ఓవర్ వేస్తున్నాడు.

షమీ వేసిన ఐదో బంతి ఆర్సీబీ ఓపెనర్ పార్థివ్ పటేల్ బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌కు తగిలి వికెట్ల పక్క నుంచి బౌండరీకి వెళ్లిపోయింది. ఇది చూసిన రాహుల్ ఒక్కసారిగా బూతు మాటను పైకి అనేశాడు. ఆ వెంటనే తన కాలర్‌కు మైక్ ఉందన్న విషయం గుర్తొచ్చి నాలుక్కరుచుకున్నాడు. తన మాటలు మైక్‌ ద్వారా ఎక్కడ బయటకి వెళ్లిపోయాయోనని కంగారుపడ్డాడు. ఆ వెంటనే కామెంటేటర్లను అడిగి తన వ్యాఖ్యలు కెమెరాలో రికార్డయ్యాయో లేదో చెక్ చేయాలని కోరడం కనిపించింది.

advertisement

More Flash News
advertisement
..more
advertisement