తొలి విజయంతో పాటే... కోహ్లీపై రూ. 12 లక్షల జరిమానా!

14-04-2019 Sun 11:35
advertisement

నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా, ఆర్సీబీ జట్టు కెప్టెన్ పై రూ. 12 లక్షల జరిమానాను విధిస్తున్నట్టు ఐపీఎల్ మేనేజ్ మెంట్ వెల్లడించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, నియమిత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడం నేరమన్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ గా ఉన్న కోహ్లీ, తన మ్యాచ్ ఫీజులో కొంత జరిమానాగా చెల్లించక తప్పని పరిస్థితి. ఈ సీజన్ లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా చెల్లించిన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లోనే రోహిత్ జరిమానా కట్టాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానే కూడా ఇదే తరహా శిక్షకు గురయ్యాడు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement