6990242410... ఫోన్ నంబర్ కాదు... ఏంటో తెలుసుకుని అవాక్కవుతున్న కోహ్లీ ఫ్యాన్స్!

24-03-2019 Sun 09:46
advertisement

6990242410... ఏదో మొబైల్ నంబర్ అనుకుంటున్నారా? కాదండీ... నిన్న జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లలో పది మంది చేసిన స్కోర్లు. ఒక్క పార్థివ్ పటేల్ మినహా మిగతా పది మంది చేసిన స్కోర్లివి. ఈ మ్యాచ్ లో కోహ్లీ 6, మొయిన్ అలీ 9, డివిలియర్స్ 9, హెట్ మెయర్ 0, శివమ్ దూబే 2, గ్రాండ్ హోమ్ 4, నవదీప్ సైనీ 2, చాహాల్ 4, ఉమేశ్ యాదవ్ 1, సిరాజ్ 0 పరుగులు చేశారు. వీరు కొట్టిన పరుగులను ఓ చోట చేరిస్తే అది ఓ మొబైల్ నంబర్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన ఘోరంగా ఓడిపోవడాన్ని కోహ్లీ, ఆర్సీబీ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. చెన్నైపై కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారని, ఇది అవమానకరమని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

advertisement

More Flash News
advertisement
..more
advertisement