Ap7am Home
menu ☰

‘జబర్దస్త్’ సుధీర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోదరుడి వివాహానికి హాజరైన నటులు!

‘జబర్దస్త్’ ఫేమ్ సుధీర్ సోదరుడి వివాహానికి పలువురు సినిమా, టీవీ నటులు, యాంకర్లు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన ఈ వివాహానికి  ప్రముఖ నటుడు నాగబాబు, నటి రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ సహా ‘జబర్దస్త్’ టీం ఈ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా కొత్త దంపతులను వారు ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన వారిలో చాలా మంది వీరితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి.
Twitter Icon
Whatsapp Icon
Facebook Icon
Mon, Jun 19, 2017, 07:05 PM
Agency:
Copyright © 2017; www.ap7am.com