Ap7am Home
menu ☰

ఆమెకు ఎంత కావాలంటే అంతా ఇస్తారట!

నయనతార
నయనతార
ఒక్కొక్కళ్ల రేంజ్ అంతే!
ఎప్పుడూ డిమాండ్ వుంటూనే వుంటుంది. చేతి నిండా సినిమాలు వుంటూనే వుంటాయి. అడిగినంతా ఇస్తూనే వుంటారు. ప్రస్తుతం నయనతార రేంజ్ కూడా అలాగే వుంది. వెండితెరకు వచ్చి అమ్మడు ఇన్నేళ్లయినా ... ఆమె తర్వాత కొత్త కొత్త అందగత్తెలు ఎంతమంది వస్తున్నా ... ఆమె డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
ఇప్పటికే తమిళ నాట బోలెడు సినిమాలతో బిజీబిజీగా వున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది.

సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ క్రోర్ మూవీ 'సంఘమిత్ర'లో నటించడానికి ఎంత కావాలంటే అంతా ఇస్తామని నిర్మాత ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి శ్రుతిహాసన్ తప్పుకోవడంతో, ఒకరిద్దర్ని అనుకున్నా వారెవరూ ఖరారు కాకపోవడంతో ఇక నయనతారను చిత్ర నిర్మాత బతిమాలుతున్నాడట. అయితే, అమ్మడి డేట్స్ ఖాళీగా లేవు. దాంతో ఎంత కావాలంటే అంతా ఇస్తానని నిర్మాత నయన్ ను టెంప్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరి, చిన్నది డేట్స్ అడ్జస్ట్ చేసి, భారీ మొత్తంలో పారితోషికం పొందుతుందేమో చూడాలి!
Twitter Icon
Whatsapp Icon
Facebook Icon
Mon, Jun 19, 2017, 01:05 PM
.
Copyright © 2017; www.ap7am.com