నేటి వార్తలు ... టూకీగా
*  తాజాగా తాను చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం తనకు ప్రత్యేకమైన చిత్రమని అందాలతార కాజల్ అగర్వాల్ పేర్కొంది. దర్శకుడు తేజ చిత్రంతోనే తాను టాలీవుడ్ కి పరిచయమయ్యానని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన చిత్రం చేయడం ఒక విశేషమైతే.. ఇది తనకు 50వ చిత్రం కావడం మరో విశేషమని, ఆ విధంగా ఈ సినిమా తనకు ప్రత్యేకమని కాజల్ చెప్పింది. అన్నట్టు ఈ రోజు ఈ ముద్దుగుమ్మ బర్త్ డే!
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'జయ జానకీ నాయక' పేరిట తాజాగా ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడట. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  శ్రీకర్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'నేను కిడ్నాప్ అయ్యాను' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో పోసాని, బ్రహ్మానందం, పృథ్వీ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగా చిత్రం ఉంటుందని దర్శకుడు చెప్పారు.    


8 hours ago
10 hours ago
11 hours ago
12 hours ago
12 hours ago
12 hours ago
13 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
Copyright © 2017; www.ap7am.com