'నరకాసురుడు'గా వస్తున్న యువ హీరో
 యువ కథానాయకుడు సందీప్ కిషన్ 'నరకాసురుడు'గా రానున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్ని ఖరారు చేశారు. సందీప్ హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమిళంలో 'నరగసూరన్' అనే పేరును నిర్ణయించారు. కాగా, తెలుగు వెర్షన్ కి 'నరకాసురుడు'గా నామకరణం చేశారు. ఈ టైటిల్ లోగోను తాజాగా చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఇందులో శ్రియా కథానాయికగా నటిస్తుండగా... కీలక పాత్రల్లో అరవింద్ స్వామి, ఇంద్రజిత్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ పాత్ర కాస్త నెగటివ్ ఛాయలతో సాగుతుందట.  
3 mins ago
28 mins ago
28 mins ago
58 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com