నేటి వార్తలు ... టూకీగా
*  మెగాస్టార్ చిరంజీవి నటించే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంలోని కథానాయిక పాత్రధారి ఇంకా ఎంపిక కాలేదు. ఈ క్రమంలో అనుష్క కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అనుష్క వేరే ప్రాజక్టులతో బిజీగా వుండడం వల్ల ఆమె డేట్స్ ఇవ్వగలుగుతుందా? అన్నది చూడాలి! ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.      
*  ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ హీరోగా నటిస్తున్న 'సర్వర్ సుందరం' చిత్రానికి నిర్మాణంలో ఉండగానే క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగు, హిందీ భాషల  రీమేక్ హక్కుల కోసం ఓ నిర్మాత భారీ ఆఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది.  
*  మరాఠీలో నాలుగు కోట్లతో నిర్మించిన 'సైరత్' చిత్రం బాక్సాఫీసు వద్ద 100 కోట్లు కురిపించింది. దీంతో ఈ చిత్రం రీమేక్ హక్కులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో తెలుగు, తమిళ భాషల రీమేక్ హక్కులను భారీ రేటుకి జీ స్టూడియోతో కలిపి ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సొంతం చేసుకున్నారు.  
3 mins ago
29 mins ago
29 mins ago
58 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com