'ఫిదా' నుంచి టీజర్ వచ్చేసింది!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ను ఈ రోజున రిలీజ్ చేయనున్నట్టు ముందుగానే తెలియజేశారు. చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం టీజర్ ను వదిలారు. ట్రైన్ మూవ్ అవుతుండగా డోర్ దగ్గర నుంచుని ఎవరినో తెలంగాణ యాసలో సాయిపల్లవి తిడుతూ ఉండటంపై టీజర్ ను కట్ చేశారు.

 ఇక వరుణ్ తేజ్ లుక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఆయన మరింత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. తెలంగాణ అమ్మాయికి .. అమెరికా అబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఫస్టు టీజర్ ను వదిలారు. ఈ సినిమా హిట్ పై వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక శేఖర్ కమ్ములకి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం.  


6 mins ago
31 mins ago
31 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com