ఆ మూవీ షూటింగ్ పూర్తయిందట!
గీతా ఆర్ట్స్ బ్యానర్లో బుల్లితెర ప్రభాకర్ దర్శకత్వంలో ఒక హారర్ థ్రిల్లర్ ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆది .. రష్మీ ప్రధాన పాత్రలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా చెప్పుకున్నారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అప్ డేట్స్ రాలేదు.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగును పూర్తిచేశారని తెలుస్తోంది. 'యామిరుక్కు భయమే' అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. తండ్రి వారసత్వంగా వచ్చిన ఒక పాడుబడిన భవంతిని .. ఆ వారసుడు లాడ్జ్ గా మార్చేస్తాడు. అప్పటి నుంచి ఆ భవంతికి ఆత్మలు క్యూ కడతాయి. ఒక బంగ్లా నేపథ్యంలో జరిగే కథ కనుక, చకచకా ఈ సినిమా షూటింగును కానిచ్చేసినట్టు చెబుతున్నారు. పోటీ లేని సమయం చూసుకుని గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను విడుదల చేస్తారన్న మాట.  
9 mins ago
34 mins ago
34 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com