కుర్రాడు గట్టి పోటీకే సిద్ధపడ్డాడు!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకి 'జయ జానకి నాయక' అనే టైటిల్ ను నిన్ననే ఫిక్స్ చేశాడు. ముందుగా ఈ సినిమాను వచ్చేనెల 7వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఆ తరువాత మనసు మార్చుకుని, ఆగస్టు 11వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

టైటిల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అదే రోజున సాయిధరమ్ తేజ్ 'జవాన్' సినిమా రానుంది. అలాగే నితిన్ సినిమా 'లై' విడుదల కానుంది. యూత్ లోను ..  మాస్ ఆడియన్స్ లోను ఈ ఇద్దరు హీరోలకి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు బాగానే వున్నాయి. అలాంటి ఈ సినిమాలకి పోటీగా 'జయ జానకి నాయక'ను దింపుతుండటం విశేషం.     
9 mins ago
34 mins ago
34 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com