బన్నీ జోడీగా నివేదా థామస్?
వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేసే సినిమా కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు. ఈ సినిమాకి 'నా పేరు సూర్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'నా ఇల్లు ఇండియా' అనేది ట్యాగ్ లైన్. రీసెంట్ గా ఈ సినిమాను లాంచ్ చేశారు. వచ్చేనెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

 ఈ సినిమాలో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరికి నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. 'జెంటిల్ మన్'తో హిట్ కొట్టిన నివేదా థామస్ .. త్వరలో 'నిన్నుకోరి' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఎన్టీఆర్ సరసన చేస్తోన్న 'జై లవకుశ' సెట్స్ పై వుంది. ' నా పేరు సూర్య' సినిమాకి నివేదా థామస్ అయితేనే బాగుంటుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టు చెప్పుకుంటున్నారు.   
2 mins ago
27 mins ago
27 mins ago
56 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com