రవితేజతో రెడీ అవుతోన్న శ్రీను వైట్ల ?
కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తోన్న శ్రీను వైట్ల, 'మిస్టర్' సినిమాతో పూర్వ వైభవాన్ని పొందాలనుకున్నాడు. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దాంతో ఆయన అయోమయంలో పడిపోయాడు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందోననే సందేహం చాలామందిలో తలెత్తుతోంది.

ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం రవితేజతో వుండనుందని తెలుస్తోంది. రవితేజ 'నీ కోసం' సినిమాతోనే శ్రీను వైట్ల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ఈ కాంబినేషన్లో వచ్చిన 'వెంకీ' .. 'దుబాయ్ శీను' కూడా ఆడియన్స్ ను అలరించాయి. రీసెంట్ గా రవితేజకి శ్రీను వైట్ల ఓ కథను వినిపించాడట. ఆ కథ కొత్తగా అనిపించడంతో రవితేజ ఓకే చెప్పేశాడని అంటున్నారు. రవితేజ అక్కడక్కడా చెప్పిన మార్పులు సరి చేయడంలో శ్రీను వైట్ల బిజీగా వున్నాడని చెబుతున్నారు.         
3 mins ago
28 mins ago
28 mins ago
57 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com