నాని మూవీలో మరో సీనియర్ హీరోయిన్!
కొత్తదనముండే కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే నాని, వచ్చే నెలలో 'నిన్నుకోరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన తదుపరి సినిమా కూడా ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం భూమికను తీసుకున్న సంగతి తెలిసిందే.

మరో ముఖ్యమైన పాత్ర కోసం 'ఆమని'ని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. కథానాయికగా బరువైన పాత్రలను పోషించి ఆమని శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమని పాత్ర ఆమె స్థాయికి తగినట్టుగా ఉంటుందని అంటున్నారు. ఆమె ఎంట్రీ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా సాయి పల్లవి అలరించనుంది.   
9 mins ago
34 mins ago
34 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com