మెగా హీరో న్యూ మూవీ మొదలైంది!
వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'ఫిదా' విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆయన మరో సినిమాను మొదలెట్టేశాడు. ఈ మధ్య వరుణ్ తేజ్ కి వెంకీ అట్లూరి ఒక కథను వినిపించాడనీ .. అది నచ్చేసి వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే వార్తలు వచ్చాయి. ఆ సినిమానే ఈ రోజున లాంచ్ చేశారు.

 హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా, కీరవాణి క్లాప్ తో ఆరంభమైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళుతోన్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై వరుణ్ తేజ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడని అంటున్నారు.    
4 mins ago
29 mins ago
29 mins ago
58 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com