'నిన్ను కోరి' ట్రైలర్ అదుర్స్!
నాని వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండటంతో, అభిమానులంతా ఆయన తదుపరి సినిమా అయిన 'నిన్ను కోరి' పై దృష్టి పెట్టారు. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఆ ఉత్సాహంతో ఈ సినిమా టీమ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇది నాని .. ఆది పినిశెట్టి .. నివేదా థామస్ ల పాత్రల చుట్టూ తిరిగే ప్రేమకథ అనే విషయం ఈ ట్రైలర్ వలన తెలుస్తోంది.

 ఈ ముక్కోణపు ప్రేమకథకు సంబంధించిన సీన్స్ పైనే ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి చోటు కల్పిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫోటోగ్రఫీకి .. గోపీసుందర్ అందించిన సంగీతానికి మంచి మార్కులు పడుతున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ .. సినిమాపై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి.

 
4 mins ago
29 mins ago
29 mins ago
58 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com