ఆ పాత్రకి రజనీ పేరు పెట్టేశారట!
రజనీకాంత్ తాజా చిత్రంగా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. అక్కడ షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా టీమ్ చెన్నై కి షిఫ్ట్ కానుంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో మేజర్ పార్ట్ షూటింగ్ జరపనున్నారు.

 ఈ సినిమాలో అరవింద్ అనే తమిళ నటుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆయన పాత్రకి శివాజీరావు గైక్వాడ్ అనే పేరు పెట్టారట. ఇది రజనీకాంత్ అసలు పేరనే సంగతి తెలిసిందే. ఈ విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి రజనీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. రజనీ సినిమాలో ఆయన పేరుతో మరో నటుడు కనిపించనుండటం పట్ల వాళ్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత్రను ఎలా మలిచి వుంటారనే ఆసక్తిని కనబరుస్తున్నారు.      
10 mins ago
35 mins ago
35 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com