స్టార్ హీరోల జోడీగా ఛాన్స్ దొరికేనా?
తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నా, నిక్కీ గల్రానికి ఇంతవరకూ సరైన హిట్ పడలేదు. అలాంటి హిట్ కోసమే ఆమె చాలాకాలంగా ఎదురుచూస్తోంది. తమిళ .. తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మరకతమణి' సినిమా ఆ ఆశను నెరవేర్చుతుందనే నమ్మకంతో వుంది.

 తెలుగులో తనకి పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. వాళ్ల సినిమాలు తప్పకుండా చూస్తుంటానని అంది. వాళ్లతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాననీ, తన కోరిక నెరవేరే రోజు తప్పకుండా వస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. ఇక పనిలో పనిగా కోలీవుడ్లో అజిత్ .. విజయ్ లు తన ఫేవరేట్ హీరోలని సెలవిచ్చింది. ఈ స్టార్ హీరోలతో జోడీ కట్టాలనే ఆమె ఆశ నెరవేరుతుందేమో చూడాలి.   
8 mins ago
33 mins ago
33 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com