గోదావరి తీరంలో చరణ్ సందడి!
విపరీతమైన ఎండల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 'రంగస్థలం' సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రెండవ షెడ్యూల్ ను కూడా అక్కడే ఆరంభించారు. రాజమండ్రి సమీపంలోని గోదావరి తీరంలో కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుపుతున్నారు. చరణ్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

వానా కాలానికి సంబంధించిన వాతావరణం కూడా ఈ సినిమాకి అవసరమట. అందువలన వానలు పడుతున్నా .. సుకుమార్ షూటింగ్ కానిచ్చేస్తున్నాడని అంటున్నారు. కొత్త హెయిర్ స్టైల్ తో .. లుంగీ కట్టుకుని షూటింగులో పాల్గొంటున్న చరణ్ ను చూసి అక్కడి అభిమానులు మురిసిపోతున్నారట. సమంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. 
53 secs ago
26 mins ago
26 mins ago
55 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com